ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న రామ్ చరణ్ అలవాట్లలో పెద్దగా ఏమీ మార్పు రాలేదనే అంటున్నారు కుటుంబసభ్యులు. చెర్రీ పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని మురిసిపోతున్నారు. ఇంతకీ చెర్రీ నిద్రలేవగానే ఎవరి ముఖం చూస్తారు? అనేది ఇటీవల ఫ్రెండ్స్ మధ్య చర్చల్లోకి వచ్చిందట. కొందరేమో తప్పకుండా ఉపాసన అని, మరికొందరు అరచేతిని చూసుకుంటారని, ఇంకొందరేమో తల్లి సురేఖ ముఖం చూస్తారని రకరకాలుగా అనుకున్నారట. కానీ వీరందరికీ తెలియని విషయం చరణ్ మారుతి ఉపాసకుడు. నిద్రలేవగానే ఆంజనీ పుత్రుడి ముఖమే చూస్తాడట. ఇప్పటికీ హనుమాన్ చాలీసాను పొల్లుపోకుండా చెప్తారట చరణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: