మురుగదాస్ సినిమా ‘తుపాకి’ టైటిల్ గొడవ కోర్టులో మళ్ళీ శుక్రవారానికి వాయిదా పడింది. దర్శకనిర్మాతలు ఆ టైటిల్ పై ఆశలు వదులుకున్నారని, త్వరలో కొత్త టైటిల్ ను ప్రకటిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అనుకున్నది ఏదీ జరగలేదు. పైగా మురుగదాస్ సన్నిహితులతో ‘‘ఇంత కష్టపడ్డాం. ఇందరి శ్రమ వృధా పోదు.  న్యాయం తప్పకుండా మనవైపే ఉంటుంది. కోర్టులో మనమే గెలుస్తాం’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నాడట. ఈ మధ్య తన ట్విట్టర్లో కూడా ‘‘ప్రజాస్వామ్యంలో పౌరుడి చివరి నమ్మకం న్యాయస్థానం’’ మురుగదాస్ తమిళంలో పెట్టిన ట్వీట్ అందరి మధ్య సంచలనాన్ని సృష్టించింది. ఇదంతా ఓ వైపుంటే మురుగదాస్ నిర్మించనున్న తాజా చిత్రంలో జి.వి.ప్రకాష్ హీరోగా నటించనున్నారన్నది అదనపు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: