బెల్లంకొండకు చుక్కెదురైంది. ఆయన కోరినట్టు సినిమాను అక్టోబర్ 12న విడుదల చేయడానికి తమిళ నిర్మాత గ్నానవేల్ రాజా సుముఖంగా లేదు. తమిళ నిర్మాత మరెవరో కాదు సూర్య సొంత పెదనాన్న కొడుకు. అంటే సూర్య సొంత బ్యానర్ కిందే లెక్క స్టూడియో గ్రీన్ సంస్థ. తెలుగు సినిమాల మధ్య బ్రదర్స్ ను విడుదల చేస్తే తాను దెబ్బయిపోతాననే ఉద్దేశంతో బెల్లంకొండ తమిళ నిర్మాతల్ని ఆడియో వేదికపై విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రదర్స్ ను బెల్లంకొండ స్ట్రెయిట్ సినిమాగానే చిత్రీకరిస్తున్న నేపథ్యంలో స్ట్రెయిట్ సినిమాను విడుదల చేసే హక్కు బెల్లంకొండకు లేదా? అనేది సూటి ప్రశ్న. ఇవన్నీ ఒకెత్తయితే ఇటీవల ఆ చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్ చేసిన ప్రకటనలు మరో ఎత్తు. ‘‘థియేటర్ ట్రైలర్స్ ఎందుకు? త్వరలో సినిమానే చూడబోతున్నారు. ఎలాగూ టీవీల్లో 30 సెకన్ల యాడ్ లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ ట్రైలర్లు ఎందుకు? దండగ?’’ అని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.  సినిమా మీద ధీమా ఉండొచ్చు కానీ అది దర్శకనిర్మాతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు అని పలువురు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: