హీమోఫోలియా పేషంట్ల కోసం హైదరాబాద్ లోని సంస్థతో కలిసి పనిచేస్తోంది సమంత. హీమోఫోలియా గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం సమంతకు మరింత ఆనందంగా ఉందట. ఈ విషయాన్నే చెప్తూ ‘‘హీమోఫోలియాకు సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఔషదాలను అందుబాటు ధరలోకి తీసుకురావాలి. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సేవ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఎంత సంపదున్నా ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదు. ఇది నేను స్వీయానుభవంతో చెప్తున్న మాటలు’’ అని చెప్పింది సమంత. 

మరింత సమాచారం తెలుసుకోండి: