తాజాగా జరిగిన పరిణామాలతో సమంత కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్ అనక తప్పదు. ఎందుకంటే తను ఎప్పుడైతే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు అడుగుపెట్టిందో, అప్పుడే అక్కడ నెంబర్ హీరోయిన్ అవుతానని అక్కడి మేనేజర్స్ తో చెప్పింది. అయితే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేనేజర్స్ మాత్రం అందుకు కొద్దిగా టైం పడుతుంది, రెండు సంవత్సరాలు వరకూ వెయిట్ చేయాలి అన్నారట. అంత వరకూ వెయిట్ చేయలేని సమంత, తను అనుకున్నంత పని చేసి, తనే నెంబర్ వన్ హీరోయిన్ అంటూ నిరూపించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సమంత ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు మూవీలను చేస్తుంది. ఒకటి విజయ్ సరసన అయితే, మరోకటి సూర్య సరసన. ప్రస్తుతానికి ఈ రెండు మూవీలు సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాకుండా విక్రమ్ సరసన మరో మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోలీవుడ్ నుండి వినిపిస్తున్న క్లియర్ న్యూస్ ప్రకారం, ఉదయనిది స్టాలిన్ హీరోగా అహ్మద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘ఎన్డ్రెండ్రుం పున్నాగై’ సినిమా కోసం సమంతతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ లో ఉదయనిది స్టాలిన్ సరసన హన్సిక నటించాల్సి ఉండగా, చివరి నిముషంలో సమంతను చిత్రయూనిట్ ఓకే చేసింది. ఇంత కాలం కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్స్ గా కొనసాగిన హీరోయిన్స్ కి, సమంత దూకుడిని చూస్తుంటే కొద్దిగా భయమేస్తుందంట. ఏదేమైనా, సమంత వరుస ఆఫర్స్ ను చేజిక్కించుకుంటూ అనుకున్నది సాధిస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: