పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆయనకు ఎంతవరకు కలిసి వస్తోందో తెలియదు కాని పవన్ క్రేజ్ పై చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోలు ఆధార పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఒక మెగా హీరో సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే ఒక ప్రమోషన్ సాంగ్ ను తయారుచేసి అది ఆ మెగాహీరో సినిమా పబ్లిసిటీకి వాడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక వివరాలలోకి వెళితే పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సినిమా కోసం ఆ సినిమా నిర్మాత వై.వి.యస్. చౌదరి ఈ ప్లాన్ రచించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈసినిమా మార్కెట్ పై క్రేజ్ పెంచడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబోస్ చేత పవన్ గొప్పతనం పై ఆ పాట రాయించారని తెలుస్తోంది. ఈసినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించారని టాక్. ఈ మేరకు షూటింగ్ కూడా పెట్టుకుంటున్నట్లు సమాచారం. ఆర్ధిక సమస్యల మధ్య చిక్కుకుని ఉన్న ‘రేయ్’ సినిమా భవిష్యత్ ను ఈ ఎత్తుగడ ఏమైనా కాపాడుతుందేమో చూడాలి. ఇప్పటికే అల్లుఅరవింద్ నుండి ‘రేయ్’ సినిమా విడుదల విషయంలో నిర్మాత చౌదరికి వార్నింగ్ లు వస్తున్నాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చౌదరి ఏదోవిధంగా ఈసినిమాను విడుదల చేయడానికి ఈ ఎత్తుగడ వేసాడు అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: