కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రజనీకాంత్ కూతురుకి, శింబుకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది. గతంలో శింబు, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో కొంత ప్రేమాయణం నడిపినట్టు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్లియర్ న్యూస్. అయితే వీరి ప్రేమ పెళ్ళి వరకూ చేరుకోలేక పోయింది. అప్పటి నుండి శింబు, తన ఫిల్మ్ కెరీర్ లో ఏదోఒక హీరయిన్ తో ఎఫైర్ నడుపుతూ హాట్ న్యూస్ లా మారుతున్నాడు. ఇదిలా ఉంటే శింబుని రీసెంట్ గా రజనీకాంత్ కూతురు టార్గెట్ చేసింది. ‘కొచ్చాడియాన్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన రజినీ కుమార్తె సౌందర్య, తాజాగా శింబుపై స్టేట్ మెంట్ విసిరింది. ఓ ఇంటర్వ్యూలో మీరొక జర్నలిస్ట్ అయితే శింబుని ఏమి అడుగుతారు అని అడిగితే ‘శింబుని ఇక నుంచి పాడద్దని అడుగుతానని’ చెప్పింది. ఈ కామెంట్స్ కోలీవుడ్ లో దూమారం రేపుతున్నాయి. శింబు పాటలు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శింబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ భారీగానే ఉంది. అంతటి స్టార్ డం కలిగి ఉన్న శింబు పాటలపై సౌందర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ అభిమానులకి నిద్రపట్టనివ్వటం లేదు. సౌందర్య రజనీకాంత్ కి సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో నిరసనల వెల్లువ మొదలైంది. ఈ విషయంపై శింబు స్పంధిస్తే తప్ప అభిమానులు తగ్గే అవకాశం కనపడటం లేదు. అయితే శింబు పై సౌందర్యకి ఎందుకు ఇంత పగ ఉందో ఎవ్వరికి అర్ధం కావటం లేదు. ఐశ్వర్య రజీనీకాంత్ కి శింబు అన్యాయం చేశాడని, సౌందర్య రజనీకాంత్ ఈ విధంగా రివేంజ్ తీర్చుకుంటుందని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: