సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. అనుష్క అందరి హీరోలకి సరిపడే ఫిజిక్ కావడంతో ఏజ్ బార్ హీరోల వద్ద నుండి యంగ్ హీరోల వరకూ అనుష్కనే ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం తమిళ్ లో రెండు మూవీలలో నటిస్తుంది. ఒకటి రజనీకాంత్ సరసన లింగా మూవీ అయితే, మరొకటి అజిత్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ. ఈ రెండు మూవీలు కోలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ చిత్రాలు. దీంతో అనుష్క పేరు కూడ కోలీవుడ్ లో పాపులర్ అయింది. ప్రస్తుతం కోలీవుడ్ సమంత, అనుష్క పేర్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అనుష్కతో డేటింగ్ చేయటానికి తనకెటువంటి అభ్యంతరం లేదంటూ కోలీవుడ్ మీడియాకి ఓ యంగ్ హీరో చెప్పినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే శింబు, ఈసారి మరో కామెంట్ చేసి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. కోలీవుడ్ మీడియాకి చెందిన ఓ రిపోర్టర్ శింబుని అడుగుతూ, అనుష్క తోనూ మీరు రిలేషన్ లో ఉన్నట్టున్నారు అని అడిగాడట. అందుకు శింబు మాట్లాడుతూ ‘ఎవరో గాసిప్స్ రాస్తే వాటిని గుడ్డిగా నమ్మి అడగటం మంచిది కాదు. ఒకవేళ మీరు ఏవిధంగా అలోచిస్తున్నారో చెప్పండి. నేను కూడ అలాగే ఉంటాను. తన కూడ మంచి యాక్టరే. తనంటే నాకు ఇష్టమే’ అని చెప్పాడట. దీంతో శింబు చేసిన కామెంట్స్ ని చూస్తే అనుష్క తో శింబు రిలేషన్ ని మెయింటెన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: