దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం త్వరలో విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే రానా నటన, డైలాగ్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. రానా నటించిన తొలి చిత్రం, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాకు మంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ, ఆశించిన కలెక్షన్లు రాలేదు. అలాగే లీడర్ తరువాత రానా నటించిన సినిమాలు దారుణంగా పరాజయం చెందాయి. రానా నటన కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. దీంతో రానా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బాలీవడ్ లో ప్రయత్నం చేసినా అక్కడా రానాకు ఇదే పరిస్థితి ఎదురైయ్యింది. అయితే, రానా తాజా సినిమా కృష్ణం వందే జగద్గురంపై అంచనాలు పెరుగుతున్నాయి. క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అలాగే, రానా తన నటనతో ఆదరగొట్టేశాడని తెలుస్తోంది. మణిశర్మ సమకూర్చిన పాటలు, హీరోయిన్ గా నయనతార నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంటుంది. కృష్ణం వందే జగద్గురం హిట్ సాధించడం ఖాయమని సినీ జనాలు భావిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: