బూతు సినిమాల్లో నటిస్తూ సంచలనాలు చేసిన సన్నీ లియోన్ చిన్న పిల్లల ముందు ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి మాత్రం తెగ ఇబ్బంది పడిపోయింది అనే వార్త మీడియాకు సంచలనంగా మారింది. సన్నీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్పెషల్ ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్న ‘హేట్‌ స్టోరీ`2’ సినిమా లో ఆ పాట చిత్రీకరణకు యూనిట్‌ సభ్యులు అంతా షూటింగ్‌కి రెడీ అవుతుండగా ఆషూటింగ్ స్పాట్ లో పదేళ్ళ వయసు లోపు పిల్లలు చాలామంది వుండడం చూసి కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట సన్నీ. అంతే కాదు ‘వారందర్నీ వెంటనే పంపించెయ్యండి’ అంటూ యూనిట్‌ సభ్యులకు హుకూం జారీ చేసిందట. ‘చేస్తున్నది ఐటమ్‌ సాంగ్‌ పిల్లలు అలాంటివి చూస్తే ఎలా.? నాకు మాత్రం చిన్న పిల్లల ముందు నటించాలంటే చాలా ఇబ్బందిగా వుంటుంది’ అంటూ అనడమే కాకుండా ఇటువంటి సన్నివేశాలు చూస్తే పిల్లలు చెడిపోరా అని యూనిట్ సభ్యలను ప్రశ్నిoచడంతో యూనిట్ సభ్యలకు దిమ్మతెరిగే షాక్ తగిలింది అనిఅంటున్నారు. అంతేకాదు ఇప్పటిదాకా తాము ఎప్పుడూ ఇలాంటి మాటల్ని ఏ నటి నుంచీ వినలేదని చెబుతున్నారు. అయితే, సన్నీలియోన్‌ భర్త డేనియల్‌ వెబర్‌ మాత్రం, సన్నీలియోన్‌కి షూటింగ్‌ స్పాట్‌ సింపుల్‌గా వుంటే ఇష్టమనీ, హాట్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కూడ షూటింగ్ స్పాట్ లో ఎవరు ఉండటం ముఖ్యంగా పిల్లలు ఉండటం ఇష్టపడదని చెప్పడం యూనిట్ సభ్యులను మరింత ఆశ్చర్య పరిచిందట. మరి ఇన్ని విషయాలు తెలిసిన సన్నీ ఎందుకు ఇలాంటి ఐటమ్ సాంగ్స్ చేస్తోంది అనే ప్రశ్న ఎవరికైనా అనిపిస్తుంది బహుశా కోట్ల కోసం అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: