మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ షూటింగ్ లో తనకు జరిగిన ప్రమాద షాక్ నుండి బయట పడుతూ ఉంటే మరో పక్క మనోజ్ పక్కన నటించిన సన్నీ లియన్ మనోజ్ తో ఈ సినిమాలో తాను నటించిన సన్నివేశాల అనుభవాలను బయట పెడుతూ సంచలనాలు చేస్తోంది. పెరిగి పోతున్న సన్నీ లియోన్ క్రేజ్ గురించి చెప్పాలి అంటే గత ఏడాది గూగుల్ సెర్చ్ ప్రొఫైల్స్‌లో సన్ని పేరిట ఉన్న రికార్డు చూస్తే సరిపోతుంది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సచిన్ టెండుల్కర్ ఇలా ప్రముఖులందరినీ పక్కకునెట్టి సన్నీ లియోన్ ఫస్ట్ ప్లేక్ ఆక్రమించుకుంది. అటువంటి భామ మనోజ్ తో నటిస్తున్న ‘కరెంట్ తీగ’ విషయాలను లేటెస్ట్ గా మీడియాకు షేర్ చేసుకుంటూ తాను ప్రస్తుతం నటిస్తున్న మనోజ్, కోలీవుడ్ హీరో జై లు ఇద్దరూ తనకి మంచి కోపరేషన్ అందించారని, వాళ్లిద్దరితో కలిసి పనిచేసిన ఈ అనుభవాన్ని మర్చిపోలేనని సన్నీ వ్యాఖ్యానించింది. అంతేకాదు వాళ్లిద్దరూ మంచి అందగాళ్లని మనోజ్, జై లని ఆకాశానికెత్తేసింది. తమిళ్‌లో జై హీరోగా తెరకెక్కిన 'వడా కర్రీ''లోనూ సన్నీ ఓ ఐటంసాంగ్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక మనోజ్ విషయం గురించి మాట్లాడుతూ షూటింగ్ లొకేషన్‌లో తనను బాగా ఆట పట్టించాడని చెప్పుకొచ్చింది. అయితే ఇన్ని విషయాలు చెప్పిన సన్నీ మనోజ్ తో ఎటువంటి అనుభవాన్ని పొందిందో క్లారిటీ ఇవ్వలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: