చిరంజీవి 150 సినిమాప్రకటన గురించి మెగా స్టార్ అభిమానులు అంతా ఎదురు చూస్తూ ఉంటే మధ్యలో చిరూ తన అభిమానులకు మరో మెగా షాక్ ఇస్తున్నాడు. ఇప్పటి దాకా మెగా స్టార్ గా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా రకరకాల ఘట్టాలలో కనిపించిన చిరంజీవి ఒక పుస్తకం రాస్తూ రచయతగా మారబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఈ పుస్తకంలో చిరంజీవి సినీ ప్ర‌స్థానం మొత్తం ఉంటుంది అని న్యూస్. చిరంజీవి సాధించిన విజ‌యాలు, ఎదురైన ఆటుపోట్లు, ద‌ర్శ‌కులతో ప్ర‌యాణం, క‌థానాయిక‌లతో సాన్నిహిత్యo ఇలా అన్ని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయట. చిరంజీవి తన పుట్టినరోజునాడు తన 150వ సినిమా గురించి అధికారిక ప్రకటన జరిగినా జరగక పోయినా ఈ పుస్తకం గురించి మాత్రం చిరంజీవి అధికారికంగా ప్రకటిస్తాడు అని ఫిలింనగర్ టాక్.  మూడు ద‌శాబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని మెగా స్టార్ గా ఏలిన చిరంజీవి ఈ పుస్తకంలో ఏమైనా సంచలనాత్మక విషయాలు రాస్తాడా? లేదంటే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంతో మంది తారల జీవిత చరిత్రలులా కేవలం ఫోటోలతో నింపేసిన సీదా సాదా జీవిత చరిత్రగా మిగిలిపోతుందా అనే విషయం రానున్న రోజులలో తేలిపోతుంది. ఒక వైపు రామ్ చరణ్ చిరంజీవి 150వ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే చిరంజీవి రచయితగా ట్విస్ట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: