మెగా హీరో రామ్ చరణ్ తన మనస్సులోని కోరికని బయటపెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా దీనికి సబంధించిన సమాచారం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మేటర్ ఏంటంటే రామ్ చరణ్, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమాలో కొద్ది నిముషాలైన కనిపించాలని కోరుకుంటున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ని స్వయంగా రామ్ చరణ్ బయటకు చెప్పుకున్నాడు. ‘నాన్న నటించబోయే 150వ సినిమాలో నేను కూడా నటిస్తాను. ఒకవేళ నా పాత్రకి సినిమాలో అవకాశం లేకపోయినా ఎలాగైనా సినిమాలో నేను కనిపించేలా చూడమని దర్శకుడికి చెబుతాను. మా సొంత నిర్మాణ సంస్థలో నిర్మించే ఈ సినిమాకి అమ్మ నిర్మాతగా వ్యవహరిస్తారు. అన్నీ కుదిరితే నాన్న పుట్టిన రోజు నాడు కొత్త సినిమా సంగతులు చెబుతానని’ రామ్ చరణ్ అనటంతో చిరంజీవి 150వ సినిమాలో నటించబోయే స్టార్ కాస్టింగ్ పైఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా , ‘నాన్నగారికి నచ్చేలా కథ చెబితే కోటి రూపాయలు ఇస్తామని బయట ప్రచారం జరుగుతోంది. మంచి కథ చెబితే, కథలో ఇంకెలాంటి మార్పులు చేయకుండానే డైరెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లిపోవచ్చు. ఈ విధంగా జరిగితే కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదని’ రామ్ చరణ్ అన్నాడు. మొత్తంగా రామ్ చరణ్, చిరంజీవి మూవీలో నటించటమే కాకుండా రచయితలకు ఓపెన్ మనీ ఆఫర్ ని పెట్టడంతో పలు రచయితలు సైతం చిరంజీవి కోసం ప్రత్యేకంగా కథలను సిద్ధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: