ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ సమంత లవ్ స్టోరి. గతంలో సమంత, సిద్దార్ధ్ లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్తలు సంచలనం క్రియేట్ చేశాయి. అయితే దీనికి సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో బయటకు రావడం లేదు. సమంత, సిద్దార్ధ్ ల మధ్య ఉన్న ప్రేమ ఇప్పుడు బ్రేక్ అప్ జరిగిందని అంటున్నారు. అంతే కాకుండా సిద్దార్ధ్ ఫోన్ కాల్ కి సమంత ఆన్సర్ కూడ ఇవ్వడం లేదంటూ కోలీవుడ్ లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమయంలో సమంత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్. దీంతో పరిచయాలు కూడ భారీగానే పెరిగాయి. సమంత ఓ ఎన్.ఆర్.ఐ బిజినెస్ మెన్ తో పరిచయాన్ని పెంచుకున్నట్టుగా మరో కథనం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సిద్దార్ధ్ ని పక్కన పెట్టిన సమంత, ఆ బిజినెస్ మెన్ తోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తన కోసం రీసెంట్ గా ఫారిన్ ట్రిప్ కూడ వెళ్ళిందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన న్యూస్, సిద్దార్ధ్ కి అస్సలు తెలియదంట. అంతే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరోలతో సమంత బలమైన పరిచయాలను పెంచుకుంటుంది. దీంతో అనుకోని విధంగా సిద్దార్ధ్ కి సమంత దూరంగా ఉంటుంది. సమంత వద్ద సిద్దార్ధ్ వీరి పెళ్ళి విషయాన్ని ప్రస్థావనకి తెచ్చినప్పుడు, సమంత అందుకు సిద్ధంగా లేనట్టుగా, అస్సలు తనకు ఏమి పట్టనట్టుగా వ్యవహరించిందని కోలీవుడ్ మీడియా గతంలో తెగ ప్రచారం చేసింది. మొత్తానికి సమంత, సిద్దార్ధ్ ల ప్రేమ వ్యవహారం ఇక పటాపంచలైనట్టేనని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు. ఇప్పుడు సమంతతో రిలేషన్ ని మెయింటెన్ చేయటానికి చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: