బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో జంట తెరపైకి వచ్చింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని మార్చిన సల్మాన్ ఖాన్, తాజాగా తన జాబితాలోకి మరో హీరోయిన్ ని చేర్చుకున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ కిక్ మూవీకి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అలాగే చాలా కాలం తరువాత సల్మాన్ ఖాన్ నటించిన హీరోయిన్స్ లో జాక్వెలిన్ ఫెర్మాన్ డెజ్ ఫర్ఫెక్ట్ గా జోడి కుదిరిందని అంటున్నారు. ఇదిలా ఉంటే కిక్ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ తో సల్మాన్ ఖాన్ రిలేషన్ ని మెయింటెన్ చేస్తున్నట్టుగా బిటౌన్ మీడియా లో ఓపెన్ టాక్ వినిపిస్తుంది. తాజాగా తనతో కలిసి కిక్ సినిమాలో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మీద సల్లూభాయ్ తెగ ప్రశంసలు కురిపించేశాడు. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె చాలా అద్భుతంగా ఉందని సల్మాన్ చెప్పాడు. అంతే కాకుండా తనని దగ్గర నుండి చూశామంటే మతిపోతుందంటూ కామెంట్ చేశాడు. నా సినిమాలో తను హీరోయిన్ గా చేస్తున్నట్టు అనిపించలేదు. నేనే తన మూవీలో నటిస్తున్నట్టు అనిపించిందని జాక్వెలిన్ పై ఎక్కడలేని అభిమానాన్ని కురిపించాడు. ఇంతటితో ఆగకుండా 28 ఏళ్ల ఫెర్నాండెజ్ ను ట్విట్టర్ లో కూడా వదలకుండా సల్మాన్ ఫాలో అవుతున్నాడు. హేంగోవర్ పాటలో ఆమె చాలా అద్భుతంగా ఉందని, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలలో ఆమె చాలా ఫన్నీగా ఉంటుందని చెబుతూ ఆకాశానికి ఎత్తేశాడు. అయితే వీరిద్దరూ తాజాగా ఓ రెస్టారెంట్ కలిసి డిన్నర్ చేయటం, అది మీడియా కంట పడటం జరిగింది.దీంతో జాక్వెలిన్ తో సల్మాన్ కచ్ఛితంగా డేటింగ్ చేస్తున్నాడు అని మీడియాలో ఒకటే హాట్ టాపిక్స్. అయితే ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ని అడిగిన మీడియా, అందుకు సల్మాన్ ఖాన్ "ఇది చాలా కామన్" అంటూ సమాధానం ఇచ్చాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి: