నిన్నటి దాకా నాగార్జున ఎన్ కన్వెక్షన్ హాల్ ను టార్గెట్ చేసిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడు టాలీవుడ్ మహేష్ బాబు కుటుంబానికి చెందిన పద్మాలయ స్టూడియోస్ చుట్టూ తెలంగాణ ప్రభుత్వ ఉచ్చు బిగుస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్, ఏపీఎన్జీవోలు, ఎన్ఎఫ్డీసిల నుంచి వందల ఎకరాల భూములను వెనక్కి తీసుకున్న కేసీఆర్ సర్కార్ మున్ముందు మరి కొంతమందిపై కొరడా ఝుళిపించబోతున్నారనే వార్తలు మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ లిస్టు కూడా సిద్ధమైపోయినట్లు టాక్.  ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ లిస్టులో సూపర్ స్టార్ కృష్ణ ఆధ్వర్యంలోని పద్మాలయా స్టూడియో కింద ఉన్న 9 ఎకరాల పైచిలుకు భూమిని వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వస్తున్న సమాచారంతో మహేష్ కుటుంబం టెన్షన్ లో ఉన్నట్లుగా ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది. పద్మాలయా స్టూడియో ఆధీనంలో ఉన్న 9 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని రెవెన్యూ శాఖ ఒక నిర్ణయానికి రావడంతో పద్మాలయా స్టూడియోకు సమస్యలు ప్రారంభం అయ్యాయి. అయితే అక్కినేని నాగార్జన ఎన్ కన్వెన్షన్‌ కేసు విషయంలో నోటీసులకు సంబంధించి కొన్ని సమస్యలు రావడంతో ఈసారి సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా స్టూడియో విషయంలో చట్టాలను తూ.చ. తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్. పద్మలయాతో పాటు ఆనంద్ సినీ సర్వీసెస్‌కు సంబంధించిన 3ఎకరాలను కూడ తిరిగి వెనక్కి తీసుకునే ఆలోచనలో తెలంగాణా రాష్ట్ర సర్కార్ ఉంది అని అంటున్నారు. ఎదిఎమైనా రాష్ట్ర విభజన టాలీవుడ్ సెలెబ్రెటీలకు నిద్ర లేకుండా చేస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: