రామ్ చరణ్ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ ఈమధ్య తన పద్దతికి విరుద్దంగా మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ తన అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు చెర్రీ. 'గోవిందుడు'లో చరణ్ పోనీటైల్‌తో కనిపిస్తాడు సినిమా అంతా ఈ గెటప్‌లోనే ఉంటాడని టాక్. ఈ గెటప్ ఈ సినిమాలో బాగా వచ్చింది ఆట.  అయితే చరణ్ ఇంట్లో వాళ్ళు మాత్రం చరణ్ పిలక అవతారాన్ని చూసి కాస్త ఇబ్బంది పడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చరణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. ముఖ్యంగా చరణ్ అత్తగారు ఉపాసన తల్లి చరణ్ ను 'ఆ పిలక ఎప్పుడు తీసేస్తారు చరణ్‌' అని అడుగుతూ జోక్స్ వేస్తోందని చెర్రీ చెపుతున్నాడు.  ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న తన గోవిందుడు సినిమా గురించి చెపుతూ దాదాపు 40 మంది నటీనటులు ప్రతిరోజు ఈ సినిమా సెట్లో తనతో పాటు నటిస్తూ ఉండటంతో ఈ సినిమా షూటింగ్ తనకు ఒక పెళ్ళి వేడుకలా ఉందని అంటున్నాడు చెర్రీ. ఈ సినిమాలో తన లుక్ కొద్దిగా షాకింగ్ గా ఉంటుందని త్వరలోనే ఈ లుక్ కు సంబంధించిన ఫోటోలు మీడియాకు విడుదల చేస్తాను అని అంటున్నాడు చరణ్. రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘మగధీర’ సెంటిమెంట్ తో ఈ సినిమాలో కూడా పిలకను పెట్టుకున్న చరణ్ నమ్మకం ‘గోవిందుడు’ ను ఎంత వరకు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తుందో ఈ రానున్న దసరాకు తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: