సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేవుడిని, జాతకాలను నమ్మడు. కేవలం తన సినిమాలలోని హీరోయిన్ అందాలను, దెయ్యాలను నమ్మి సినిమాలను తీస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా వర్మ చేస్తున్న ప్రయోగం ‘ఐస్ క్రీమ్’ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో నటిస్తున్న యంగ్ హీరోయిన్ తేజస్వి కొన్ని న్యూడ్ సీన్స్ లో కనిపిస్తుంది అని వార్తలు రావడమే కాకుండా ఆ వార్తలను వర్మ, తేజస్వీ ఖండించక పోవడంతో ఈ సినిమా పై యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది. ఈమధ్యనే ఈ సినిమాలోని 20నిముషాల హాట్ సన్నివేశాలను మీడియాకు చూపించి సంచలనం చేసాడు వర్మ.  వర్మ తీసిన హాట్ సన్నివేశాలను చూసిన మీడియా ప్రతినిధులకు మైండ్ బ్లాంక్ అవ్వడంతో ఈ సినిమాకు వచ్చిన వారికి హనుమాన్ చాలీసా పుస్తకాలను బహుమతిగా పంచమని మీడియా వారు వర్మ పై జోక్ చేసారట. అయితే సరదాగా అన్న ఆ జోక్ నిజం చేస్తూ ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచడానికి ఈ సినిమా మొదటి ఆటకు వచ్చే ప్రేక్షకులకు హానుమాన్ చాలీసా పుస్తకాలను పంచడానికి ఏర్పాట్లు చేస్తూ వర్మ బ్రహ్మచారి హనుమంతుడిని కూడా తన ‘ఐస్ క్రీమ్’ పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: