ప్రపంచ శృంగార దేవతగా ఈమధ్య ఎంపిక అయిన బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపిక లేటెస్ట్ గా కత్రీనా పై తన కసిని వెళ్ళ గక్కింది. సినిమా పరిశ్రమలో ఏది శాస్వితం కాదు అని అంటూ ఈరోజు స్టార్ అనిపించుకున్న వాళ్ళు రేపు అదే స్థాయిలో ఉంటారని గ్యారంటి లేదు అంటూ బాలీవుడ్ లో తనకు ప్రధాన పోటీగా నిలుస్తున్న కత్రినా కైఫ్ ను ఉద్దేసించి దీపిక చేసిన కామెంట్స్ బాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారాయి. దీపిక మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న కత్రినా జెట్ వేగంతో దూసుకు వెళ్ళడం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు కత్రీనా పై దీపిక ఈ కామెంట్స్ చేసింది. అంతేకాదు కత్రినా కంటే గొప్ప అందగత్తెలు బాలీవుడ్ లో ఉన్నారని చెపుతూ తాను ఎవరి స్థాయిని సీరియస్ గా తీసుకోనని ఈ ఏడాది ఒక హీరోయిన్ హవా సాగితే వచ్చే ఏడాది మరో హీరోయిన్ హవా కొనసాగుతుందని సెటైర్లు వేస్తూ దీపిక చేసిన కామెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్  వెనుక తన నుండి బాలీవుడ్ మిల్కీ బాయ్ రణబీర్ ను దూరం చేసింది అన్న కోపంతోనే దీపిక కత్రీనాను ఇలా టార్గెట్ చేస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా కామెంట్స్ రాస్తూ దీపికకు ‘బ్యూటీ విత్ బ్రైన్’ అనే కొత్త బిరుదును దీపికకు తగిలించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: