మెగాస్టార్, పవర్ స్టార్ సీక్రెట్ మీట్ అయ్యారు అంటూ వెబ్ మీడియాలో ఈరోజు ఉదయం నుండి వార్తల హడావిడి జరుగుతోంది. చిరంజీవి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి కాషాయం గూటికి వస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చిరంజీవి తన పొలిటికల్ ప్లాన్ ను తన తమ్ముడు పవన్ తో చర్చిoచాడని వెబ్ మీడియా కధనాలు. ఈ వార్తలుఎన్ని నిజాలో తెలియకపోయినా మీడియా కు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.  ఒక్కసీటు కూడా సంపాదించుకోలేని కాంగ్రెస్ ను నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదనే అభిప్రాయంతో ఉన్న చిరంజీవి తన రాజకీయ ఉద్దేశాలు తన తమ్ముడితో చర్చించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలు ఇలా రావడానికి ఒక ప్రధాన కారణం కుడా ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఎపి హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం గత కొద్దికాలంగా కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతోనే పావులు కదుపుతున్నారని టాక్. ఈ ప్రయత్నంలో మోడీ ఇమేజ్ తో పాటు చిరంజీవిని పార్టీలోకి తీసుకొస్తే పార్టీకి గ్లామర్ రావడం ఖాయమని కమలం పార్టీ పెద్దల ఆలోచన అని అంటున్నారు. దీనికోసమే చిరంజీవిని భారతీయ జనతాపార్టీ లోకి తీసుకు వస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో చిరంజీవికి సంకేతాలు వెళ్ళాయి అని అంటున్నారు.  అయితే చిరంజీవి మాత్రం ఇప్పట్లో ఎలాగూ ఎన్నికలు లేవు పైగా రాజ్యసభ సభ్యత్యం ఉండగా ఎందుకు ఈ హడావిడి అన్న అభిప్రాయంతో ఉన్నాడని టాక్. అందుకే ప్రస్తుత పరిస్థితుల వాస్తవాలను చిరంజీవి పవన్ కు వివరిoచాడని ఫిలిం నగర్ టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా గత రెండు రోజులుగా వెబ్ మీడియా లో పవన్ బయట కనిపించుటలేదు అంటూ పవన్ ఫోటోలు పెట్టి కొందరు వేస్తున్న సెటైర్లు కుడా సంచలనం గా మారాయి. ఏది ఏమైనా ఒకేసారి చిరంజీవి - పవన్ ల వార్తలతో వెబ్ మీడియా మరొకసారి సందడి చేస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: