బాలీవుడ్ మూవీ ‘హేట్ స్టోరీ-2' చిత్రం ట్రైలర్‌కు యూట్యూబులో మంచి స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత మిలియన్ల కొద్దీ ఈ ట్రైలర్ ను వెబ్ మీడియాలో వీక్షకులు వీక్షించారు. ఇందులో హాట్ అండ్ సెక్సీ సీన్లు ఉండటంతో యూత్ ను ఈ ట్రైలర్ బాగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో హీరోతో రొమాంటిక్ సీన్లతో పాటు సినిమాలో హీరోయిన్ సుర్వీన్ చావ్లాపై విలన్ రేప్ చేసే సీన్లు కూడా ఉన్నాయి.  ఈ సీన్లను అత్యంత క్రూరంగా తెరపై చూపించబోతున్నారని టాక్. అయితే రేప్ సీన్లు చేస్తున్నపుడు చాలా కష్టంగా అనిపించిందని, చాలా ఒత్తిడికి గురయ్యానని, ఒక రకంగా చెప్పాలంటే నరకం అనుభవించానని చెపుతోంది సుర్వీన్ చావ్లా.  కోస్టార్ సుశాంత్ సింగ్‌తో కలిసి రేప్ సీన్ లో  నటిస్తున్నప్పుడు  చాలా కష్టంగా, నరకంలా అనిపించిందనీ నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురు అయినప్పుడు మహిళలు ఎంత వేదనకు గురవుతారో  తాను అర్థం చేసుకోగలను అంటోంది సుర్వీన్ చావ్లా. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి అని దర్శక నిర్మాతల భావన.  ఒక హాట్ సీన్ లో నటించడం ద్వారా సుర్వీన్ చావ్లాకు నేటి మహిళల పై జరుగుతున్న అత్యాచార బాధలు అర్ధం అయింది కాబోలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: