సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ సమంతపై దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ ఇన్వెస్ట్ చేయటానికి ఓ నిర్మాత ముందుకు వచ్చినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం సమంత పలు భారీ మూవీల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే సమంత ఇప్పటి వరకూ హీరోయిన్ ఓరియన్ టెడ్ మూవీల్లో నటించలేదు. అయితే త్వరలోనే సమంత తో లీడ్ రోల్ తో ఉన్న ఓ మూవీ స్టార్ట్ కాబోతుందనే వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ ప్రొడ్యూజర్, సమంత లీడ్ రోల్ తో ఉన్న ఓ స్టోరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు యాభై కోట్ల రూపాయలుగా ఫిక్స్ అయిందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. సమంత చేస్తున్న మూవీలు అనంతరం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ త్వరలోనే బయటకు రానుందని అంటున్నారు. సమంత కూడ లీడ్ రోల్స్ చేసేందుకు గత కొద్దికాలంగా కథలను వింటున్నదనే విషయం అందిరికి తెలిసిందే. అయితే తను ఇప్పటి వరకూ చాలా కథలనే విన్నది. ఏ కథ కూడ తనకు నచ్చే విధంగా లేదని సన్నిహితులతో చెప్పుకొచ్చింది. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఓ బడా ప్రొడ్యూజర్, ఫాంలో ఉన్న డైరెక్టర్ ని తీసుకొని వెళ్ళి సమంతకి కథ చెప్పించాడట. ఆ స్టోరిను విన్న వెంటనే సమంత ఓకె చేయటం, మూవీ బడ్జెట్ యాభై కోట్ల రూపాయలు అని తెలుసుకొని ఆశ్ఛర్యపడటం జరిగిపోయింది. మొత్తానికి సమంత మీద ఒక్కసారిగా అంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం అంటే చాలా రిస్కే అని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: