ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ బాట పట్టారు. ఇప్పటి వరకూ ఈ లిస్ట్ లో తమన్న, సమంతలు మాత్రమే ఉంటే ఇప్పుడు కాజల్ కూడ చేరింది. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న గీతాంజలి మూవీలో కాజల్ అగర్వాల్ చేత ఐటెం సాంగ్ చేయించాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది. ఆ విధంగానే దర్శకుడు కోనవెంకట్ కాజల్ అగర్వాల్ ని అప్రోచ్ అయినట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కాజల్ కూడ పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ కి కూడ అవకాశాలు చాలా తక్కువుగానే ఉన్నాయి. రామ్ చరణ్ సరసన గోవిందుడు అందరి వాడేలే మూవీలో నటిస్తుంది. ఈ మూవీ తరువాత పూరీజగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నఅప్ కమింగ్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ రెండు మూవీలు తప్పితే కాజల్ కి పెధ్దగా ఆఫర్స్ కూడ లేవు. టాప్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తున్నప్పుడు తను సైతం ఐటెం సాంగ్స్ చేయకపోతే డిమాండ్ తగ్గిపోతుందోమో అన్న ఫీలింగ్ కూడ కాజల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే తను ఓ క్రేజీ ఫిల్మ్ లో ఐటెం ఆఫర్ వస్తే చేయాలని తెగ ఉత్సాహం చూపుతుందట. అలాగే తను చేయబోతున్న ఐటెం సాంగ్ కి ఎంత వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందో అన్నది కూడ ఇప్పుడు ఇండస్ట్రీలో న్యూస్ గా మారింది. ఓ వైపు తమన్న, శ్రుతిహాసన్ లు ఐటెం సాంగ్ కోసం ఏకంగా యాభై లక్షల నుండి డెబ్భై లక్షల వరకూ తీసుకుంటున్నారు. కాజల్ కి వీరిద్దరికి ఉన్న డిమాండ్ ఉంటుందా? అనేది కూడ టాలీవుడ్ లో డౌట్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: