పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోపాల గోపాల. ఈ మూవీ మల్టీస్టారర్ మూవీ కావడంతో, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ ఫిల్మ్ డిటైల్స్ పై ప్రత్యేకంగా ఆసక్తిని చూపుతుంది. మూవీ ఎప్పడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సాంగ్స్ ఎలా ఉంటాయి? వంటి విషయాలపై సాధారణ సినీజనాలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యణ్ మాత్రం తన సిద్ధాంతాలతో, ట్రైనింగ్ లతో నిర్మాతలకి విసుగుతెప్పిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ మవీలో మోడరన్ కృష్ణుడి వేషం వేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ, పవన్ ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం వెంకటేష్, శ్రియా తదితరులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాని అక్టోబర్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ కిషోర్ పార్ధసానికి, పవన్ కళ్యాణ్ సీన్స్ కి సంబంధించిన షూటింగ్ మరి కొంత సమయం పడుతుందని ఈ లోపు షూటింగ్ కి సంబంధించిన అన్నింటికి షూట్ చేసుకోవల్సిందిగా నిర్మాతలు చెప్పారు. పవన్ ఇచ్చిన డేట్స్ లేట్ అవటంతో షూటింగ్ కి సంబంధించిన ఖర్చు 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అసలే స్ట్రిక్ గా షెడ్యూల్ ని ఫాలో సురేష్ సంస్థకి, యాక్టర్ లేట్ కమింగ్ అనేది మింగుడు పడటంలేదంట. సురేష్ బాబు – అలాగే పవన్ ప్రెండ్ అయిన శరత్ మరార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు అనేది ఇంకా క్లారిటి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: