పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ కు తను నటించే పాత్రలకు సంబంధించి హోమ్ వర్క్ చేయడం పెద్దగా అలవాటు లేదు. సినిమా షూటింగ్ స్పాట్ లోకి వచ్చిన తరువాత మాత్రమే ఆ పాత్ర గురించి ఆలోచిస్తాడు అని అంటారు. పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమా క్లైమ్యాక్స్ లో పవన్ చూపెట్టిన ఎక్స్ ప్రెషన్స్ గురించి పవన్ ఏమాత్రం హోమ్ వర్క్ చేయకుండా అప్పటికప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఏమీ చెప్పకుండానే నటించాడని త్రివిక్రమ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ నేపధ్యంలో పవన్ తన నట జీవితంలో ఎప్పుడూ పోషించని ఆధ్యాత్మిక షేడ్స్ ఉన్న పాత్రలో ‘గోపాలా గోపాలా’ లో కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాలో తన పాత్రను మెప్పించడం కోసం భారీ కసరత్తులు చేయడమే కాకుండా ఈ సినిమా కోసం వివిధ గెటప్పులతో ట్రైల్ షూట్స్  చేస్తున్నా ఏ గెటప్ పవన్ కు పరిపూర్ణంగా నచ్చడంలేదు అని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రంలో తనది దేవుడి పాత్ర కాబట్టి ఎప్పటిలా నటిస్తే ఆడియన్స్‌ సరిగ్గా రిసీవ్‌ చేసుకోకపోవచ్చునని పవన్‌ భయపడుతున్నాడు అని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకూ తాను నటించిన ప్రతి సినిమాలోను ఎక్కువగా జీన్స్, టి.షర్టులతో కనిపించే పవన్ తన గోపాలుడు పాత్రకు డ్రస్సు సెలెక్ట్ చేసుకోవడంలో ఎప్పుడు పడనంత టెన్షన్ పడుతున్నాడని ఫిలింనగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: