క్రియేటివ్ దర్శకుడిగా దేవకట్టాకు మంచి పేరుంది. అయితే లేటెస్ట్ గా దేవకట్టా తీసిన ‘ఆటో నగర్ సూర్య’ సినిమా పరాజయం చెందడంతో ఆ పరాజయ భారాన్ని తట్టుకోలేక తన సినిమా బాగుండలేదు అని విమర్శిస్తున్న విమర్శకుల పై ఎదురు దాడి చేస్తూ దేవకట్టా పెడుతున్న ట్విట్స్ అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా అసలు ఈ దర్శకుడికి ఏమైంది అనే స్థాయిలో ఆ ట్విట్స్ కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా దేవకట్టా ఎప్పుడో 1957లో ప్రముఖ ఆంగ్ల రచయిత అయాన్ రాండ్ రాసిన పాపులర్ నవల ‘అట్లాస్ షగ్డ్’ తో తన సినిమా ఆటోను పోల్చుకుంటు పెట్టిన ట్విట్ చదివిన వారంతా ఆశ్చర్య పోతున్నారు.  ఆ పుస్తకం విడుదలైనప్పుడు కూడా ఎంతో మంది విమర్శకులు ఆ పుస్తకాన్ని టార్గెట్ చేసారని అయినా ఇప్పటికీ ఎంతో మంది రచయితలు అ పుస్తకాన్ని ఇప్పటికీ ఎనలైజ్ చేస్తున్నారు అని అంటూ తన ట్వీట్ తో పాటు ఆ రోజుల్లో పుస్తకం విడుదలైనప్పుడు వచ్చిన విమర్శనలను కూడా ప్రస్తావించాడు దేవకట్టా. అయితే ఈ ట్విట్ ను చదివిన వారు చాల మంది దేవకట్టా ‘ఆటోనగర్’ సినిమా కూడా భవిష్యత్ లో ఆ పుస్తకం అంత గొప్పది అయి టాలీవుడ్ లో ఒక ‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’ సినిమాలులా క్లాసిక్ గా మిగిలి పోతుందని దేవకట్టా అభిప్రాయం కాబోలు అని ఆయన పై సెటైర్లు కూడ వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: