బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం టాప్ హీరోలు తాము నటిస్తున్న సినిమాలలో ఎదో ఒక పాట పాడటం ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారిపోయింది. తమ అభిమాన హీరోలు గోoతు విప్పి పాడితే చాలు అవి ఎంత చెత్తగా ఉన్నా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సల్మాన్ నటిస్తున్న ‘కిక్' సినిమాలో తాను పాడిన 'హేంగోవర్' పాటకు మంచి ఆదరణ లభించినందుకు ఆనందంగా ఉంది అంటూ తాను ఎంత చెత్తగా పాటలు పాడినా తన పాటలను ఆదరిస్తున్న తన అభిమానులను చూస్తూ ఉంటే తనకే ఆశ్చర్యం వేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేసాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.  ముంబైలో 'కిక్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసాడు. తాను చాలా చెత్తగా పాటలు పాడతానని తనకు వ్యక్తిగతంగా తెలుసు అని అయినా తాను ‘కిక్’ సినిమాలో పాడిన పాట ఇదే తన తొలి గీతం అయినట్టు వ్యాఖ్యలు రావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. తానింతకు ముందు 'హలో బ్రదర్', 'వాంటెడ్' సినిమాల్లో పాటలు పాడానని తెలిపాడు. ఆ రెండు పాటలే 'హేంగోవర్' పాట కంటే శ్రద్ధగా పాడానని అన్నాడు. అయినా హేంగోవర్ పాటకి వచ్చినంత ఆదరణ వాటికి రాలేదని సల్లూభాయ్ అభిప్రాయ పడ్డాడు. టాలీవుడ్ లో రవితేజ నటించిన 'కిక్' సినిమాకి రీమేక్ గా సల్లూభాయ్ 'కిక్' సినిమా తీస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగి పోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: