సినిమా రంగంలో ఉన్నపుడుమెగాస్టార్ గా మూడు దశాబ్దాలు టాలీవుడ్ ను ఏలిన చిరంజీవి రేంజ్ ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన మాస్ హీరో చిరంజీవి అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. గతంలో ఎన్టీఆర్ మాదిరిగా ముఖ్య మంత్రి అవుదామని ఆసపడి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన చిరంజీవికి 2009 ఎన్నికల్లో పెద్ద నిరాశ ఎదురైంది.  ఆ తర్వాత పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేయడం కేంద్ర మంత్రి పదవి పొందడం అందరికి తెలిసిన విషయాలే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చే బాధ్యతలు చేపట్టిన చిరంజీవికి ఘోర పరాభవం ఎదురై కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన కూడ జీరోగా మారిపోయి ప్రస్తుతం తీవ్ర ఆశ నిరాశల మధ్య రోజులు గడుపుతున్నాడు.  ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఈమధ్య ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్ చిరంజీవిని కలిసాడట. అతడు చెప్పిన విషయాలు చిరంజీవిని షాక్ లో ముంచేసాయి అని అంటున్నారు. ఆ న్యూమరాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం షార్ట్ కట్‌లో మీడియా తరుచు ‘చిరు.. చిరు..’ అని రాయడం వల్ల చిరంజీవిని దురదృష్టం వెంటాడిందట. చిరు అనే పేరులోనే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని ఆ న్యూమరాలజిస్ట్ అభిప్రాయం. దీనితో తన ప్రస్తుత పరిస్థితికి కారణం తెలిసిన చిరంజీవి నష్ట నివారణ చర్యలు చేపట్టాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఇక పై తనను ఎవరూ ‘చిరు' అని పిలవకుండా పూర్తి పేరుతో ‘చిరంజీవి' అని పిలిచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఈ మేరకు మీడియా వారికి కూడా సందేశాలు పంపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిమానుల గుండెలలో చిరూగా ఫిక్స్ అయిపోయిన ఈ పేరు అంత సులువుగా వాడుకలో మారిపోతుందా అన్నదే ప్రశ్న?  

మరింత సమాచారం తెలుసుకోండి: