కొద్దీ రోజుల క్రితం వెంకటేష్ తాను మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే మంచి కథలు దొరకడం లేదని అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ సినిమాల తరువాత తన వద్దకి చాలా కథలు వచ్చినా అవి ఏమీ నచ్చక వదిలేసుకున్నాను అని వెంకటేష్ చెప్పిన మాటలు ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ కథను ఉద్దేశించి వెంకీ ఈ మాటలు అన్నాడు అంటూ ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ ‘గోవిందుడు’ సినిమాలో చరణ్ తో కలిసి నటించడం ఫిక్స్ అయిన తరువాత చివరి నిముషంలో ఈ సినిమా నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీని పై రకరకాల రూమర్స్ కూడ బయటకు వచ్చాయి.  అయితే వెంకటేష్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ‘గోవిందుడు’ సినిమా కథ ఇంట్రెస్టింగ్‌గా లేదా? కథ నచ్చకే వెంకటేష్‌ ఆ సినిమా వదులుకున్నాడా? మరి గోవిందుడు అందరివాడేలే చరిత్ర సృష్టిస్తుందని అంటున్న కృష్ణవంశీ చెబుతున్నవి ఉత్తి మాటలేనా? ఏదేమైనా వెంకటేష్‌ నటించకపోవడం వల్ల ‘గోవిందుడు అందరివాడేలే’కి క్రేజ్‌ రావడం లేదా అంటూ రకరకాల గాసిప్పులతో గోవిందుడు సినిమా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  ఈ వార్తల నేపధ్యంలో చరణ్ ‘గోవిందుడు’ ఇంకా సినిమా పూర్తి కాకుండానే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వెంటాడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ పరిస్థుతులకు కారణాలు విశ్లేషిస్తే వెంకటేష్ అన్యాపదేశంగా ‘గోవిందుడు’ సినిమా పై చేసిన కామెంట్స్ ఆ సినిమా నిర్మాతలను భయపెడుతున్నట్లే అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: