శ్రుతిహాసన్ కు తాను నటించిన బాలీవుడ్ మూవీ ‘డి-డే' పెద్ద సమస్యగా వెంటాడుతోంది. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమాలో శ్రుతి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి శృంగార భంగిమల్లో నటించడం ఒక సంచలనం అయితే విమర్శకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడా సినిమా తెలుగులోకి డబ్ చేసి ఈ నెలలో విడుదల కాబోతూ ఉండటం శ్రుతిహాసన్ కు తల నొప్పిగా మారింది. ఈ సినిమాకు పబ్లిసిటీ కలిగించడానికి శ్రుతిహాసన్ ఈ సినిమాలో చేసిన హాట్ సీన్స్ ఫోటోలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా నిర్మాతలు భారీ పబ్లిసిటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న విషయాలను తెలుసుకున్న శ్రుతి చాల అసహనంగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. కేవలం ఈ సినిమాలోని తన హాట్ సీన్లు ఫోకస్ చేస్తూ థియేటర్లకు జనాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారనీ ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత సురేష్ దూడల తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని ‘గెలుపు గుర్రం' పేరుతో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శృతి హాసన్ నటించిన హాట్ హాట్ సీన్లు ఈ సినిమాలో ఎక్కువగా ఉండటంతో ఈసినిమాకు బి,సి సెంటర్లలో భారీ వసూళ్ళు వస్తాయని నిర్మాతల ప్లాన్ అని అంటున్నారు. అందుకునే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో భారీగా నిర్మాతలు ఖర్చు పెట్టబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయిన ఈ సినిమా విడుదల అయితే తన పై విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందని శ్రుతి భయపడుతున్నట్లు టాక్. బాలీవుడ్ కు దక్షిణాది సినిమా రంగానికి పరిస్థుతులు చాల తేడా ఉండటంతో ఈ ‘గెలుపు గుర్రం’ సినిమాకు సంబంధించి కనీసం తన హాట్ సీన్స్ ఫోటోలు పబ్లిసిటీలో ఎక్కువగా ఉపయోగించకుండా ఆ నిర్మాత పై శ్రుతి తెస్తున్న ఒత్తిడి ఆ నిర్మాత వింటాడా అన్నదే ప్రశ్న.  

మరింత సమాచారం తెలుసుకోండి: