టాలీవుడ్ క్యూట్ హీరొయిన్ సమంతకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విపరీతంగా కోపం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సమంత అడిగిన చిన్న కోరికను కూడా జూనియర్ మన్నించకపోవడంతో ఈ మాయలేడి జూనియర్ పై అలక పూనిందని టాక్. ఇక వివరాలలోకి వెళితే సమంత చెన్నైలో జరుగుతున్న విజయ్ అవార్డుల ఫంక్షన్ కు వెళదామనుకుందట. దీనికి కారణం ఆ అవార్డు ఫంక్షన్ లో హడావిడి చేసి తాను కోలీవుడ్ లో హీరో సూర్యతో నటిస్తున్న ‘అంజాన్’ సినిమాకు పబ్లిసిటీ చేసుకుందామని మాస్టర్ ప్లాన్ కూడ వేసుకుందట. అయితే ప్రస్తుతం ఆమె ‘రభస’ షూటింగ్ లో చిక్కుకోవడంతో ఒక రోజు షూటింగ్ నుండి డుమ్మా కొట్టడానికి పర్మిషన్ ఈ సినిమా దర్శక నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సంతోష్ శ్రీనివాస్ ల అనుమతి అడిగిందట. ఒకరోజే కదా సమంత కోరిక తీరుద్దామని దర్శక నిర్మాతలు ఒప్పుకున్నా ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఇప్పటికే రకరకాల కారణాలతో ఆలస్యం అయిపోతున్న ఈ సినిమా షూటింగ్ ను మరోరోజు ఎలా ఆపేస్తారు అంటూ నిర్మాతకు క్లాసు పీకడంతో బెల్లంకొండ సమంతకు ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేసాడట. ఈ విషయం తెలుసుకున్న సమంత తాను బెల్లంకొండ కుమారుడు సినిమా విషయంలో ఎంతో సహకరించిన ఒక్కరోజు కూడ పర్మిషన్ ఇవ్వరా అంటూ బెల్లంకొండ పై కోపం తెచ్చు కోవడమే కాకుండా తనను విజయ్ అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్ళనీయకుండా చేసిన జూనియర్ పై విపరీతంగా కోపంగా ఉంది అని వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోలతో ఇలాంటి బాధలు ఉంటాయని కాబోలు కధ బాగుంటే చిన్న హీరోలైనా రెడీ అంటోంది సమంత.. 

మరింత సమాచారం తెలుసుకోండి: