నరేంద్ర మోదీ పాలన ప్రారంభమైన నెలరోజులకే సామాన్యులలో పెరుగుతున్న ధరలు వల్ల అశాంతి కలుగుతోంది. అద్భుతాలు కాకపోయినా ఎంతో కొంత మేలుజరుగుతుంది అని ఆశ పెట్టుకున్న సామాన్యుడి కల పగటి కలగా మారిపోతుంటే బిజేపి ప్రభుత్వం పై ఉన్న కోపం ప్రశ్నలుగా మారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నాయి. తాను మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల తరఫున తన ‘జనసేన’ ద్వారా ప్రశ్నిస్తాను అన్న పవన్ మరి ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తూ పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నాడు? అంటూ నిన్న పార్లమెంట్ లో ప్రవేశ రైల్వే బడ్జెట్‌పై ప్రసారం అయిన సగటు ఓటరు స్పందన కార్యక్రమంలో ఒక సామాన్యుడు పవన్ ను టార్గెట్ చేస్తూ అన్న కామెంట్స్ యధాతదంగా ఒక ప్రముఖ ఛానల్ ప్రచారం చేసింది. దీనిని బట్టి చూస్తూ ఉంటే అధికారంలో పవన్ లేకపోయినా అధికార పార్టీలను సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ పై జనానికి కోపం మొదలు అయినట్లుగా ఆ సామాన్యుడి మాటలు బట్టి ఎవరికైనా అర్ధం అవుతుంది. రానున్న కాలంలో జనసేనను జనంలోకి తీసుకు వెళదాము అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నించక పోయినా తిరిగి సామాన్యులు తనను ప్రశ్నిస్తున్న వాస్తవాలను గుర్తించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: