మూగజీవాలంటే మన హీరోయిన్స్ కు చాలామందికి ఇష్టం. ముఖ్యంగా కుక్కలు అంటీ మన బ్యూటీలు చాలా ప్రేమ కురిపిస్తారు. చాలామంది హీరోయిన్ల ఇళ్ళలో వివిధ జాతులకు చెందిన ఖరీదైన డాగ్స్ కనపడుతూ ఉంటాయి. కోలీవుడ్ బ్యూటీ త్రిషకు శునకాలంటే విపరీతమైన ప్రేమ. అందుకే త్రిషకు ఎక్కడ ఊరకుక్క కనిపించినా ఆమె దాని సంరక్షణ బాధ్యతలను స్వీకరించడమే కాకుండా అ శునక సంరక్షణ సంస్థకు ఆమె తన వంతు సాయం చేస్తూ ఉంటుంది. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కధ వేరు. ఈమెకు కుడా కుక్కలు అంటే చిన్నతనం నుండి ఇష్టం అట. తన జీవితంలో ఒక్క కుక్క పిల్లను అయినా పెంచుకోవాలని ఎప్పటి నుంచో తమన్నా ప్రయత్నం. అయితే తమన్న తల్లికి నచ్చని ఏకైక విషయం కుక్కలపై ప్రేమ చూపడమేనట. దీంతో తమన్న ఇటీవల వరకు తన ఆశను తనలోనే అణగదొక్కుకుంటూ వచ్చింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో మిల్కీ బ్యూటీకి ఒక చిత్రంలో శునకాలతో నటించే అవకాశం వచ్చిందట. ఈ సినిమాలో కధతో పాటు కుక్కలకు కూడ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఒక దర్శకుడు చెప్పిన ఈ కధ వినగానే తమన్నా మారు మాట్లాడకుండా ఒప్పెసుకోవడమే కాకుండా తన పారితోషికాన్ని బాగా తగ్గించుకుని ఆ సినిమా దర్శక నిర్మాతలకు సహకరించిందని టాక్. తమన్నా వీక్ పోయింట్ తెలిసి పోయింది కాబట్టి భవిష్యత్ లో ఆమెతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు కుక్కకు కూడ ఒక మంచి పాత్ర ఇస్తే తమన్నా డేట్స్ వెంటనే దొరకడమే కాకుండా పారితోషికం విషయంలో కూడ డిస్కౌంట్ ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: