టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన స్టార్ డం ని సంపాదించుకున్న హీరో రవితేజ. రవితేజ నటించిన మూవీలు గత కాలంలో వరుసగా ప్లాపులని చూస్తే, ఇప్పుడు మాత్రం చాలా తెలివిగా మూవీల ఎంపికని చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం పవర్. పవర్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రవితేజ నటించిన ‘బలుపు’ సినిమా విడుదలై ఏడాది దాటింది. వరుస పరాజయాల తర్వాత రవితేజ నటించిన బలుపు చిత్రం తనకి సక్సెస్ ని ఇచ్చింది. ఆ తరువాత వస్తున్న చిత్రం పవర్ మూవీ. ఈ మూవీపై రవితేజ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బలుపు మూవీ కంటే పవర్ మూవీపై రవితేజ ఎక్కువ నమ్మకాలని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ ని త్వరగా షూట్ చేద్దాం అని దర్శకుడు, రవితేజకి చెప్పినా ఏ మాత్రం రాజీ పడటం లేదట. మంచి సీన్స్ కోసం ఎంత టైం తీసుకున్న పర్వాలేదని రవితేజ దర్శకుడికి చెబుతున్నాడు. అందుకే ఈ ఏడాది పాటు మాస్ మహారాజ నటించిన మరో సినిమా విడుదల కాలేదు. ‘పవర్’ సినిమా రవితేజ అభిమానులని తెగ అలరిస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ మూవీలో రవితేజ పోలీస్ ఆఫీసర్’గా నటిస్తున్నారు. రవితేజ సరసన హన్సిక నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ అనంతరం మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయిందనే చెప్పవచ్చు. బలుపు కథారచయిత బాబీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్ట్ లో ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ ఉంటుందని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. రవితేజా లో ఈ మార్పును చూసిన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశ్ఛర్యపడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: