మెగా హీరో చిరంజీవి నటిస్తున్న 150వ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినపడుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి రాజకీయ పరంగా ఎక్కువుగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పక్ష హోదాలో ఉన్న చిరంజీవి, ప్రజలకు ఎటువంటి న్యాయం చేకూర్చాలో, ఆ దిశగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తగు విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. చిరంజీవిని ఎవరైనా అడిగితే తను ఇటువంటి సమాధానమే చెబుతున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం కి సంబంధించిన పనులలో ఫుల్ బిజిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తను చేయబోతున్న మూవీకి కథ ఎలా ఉండాలి అనే విషయం నుండి కథకు సంబంధించిన సీన్స్ ను సైతం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయాలన్నింటిని చిరంజీవి స్వయంగా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి చెప్పే ఆలోచనలో ఉన్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి తన 150వ చిత్రాన్ని కేవలం ఓ సాధారణ స్టార్ కాస్టింగ్ మూవీ గా మిగిలిపోకూడదనే ఉద్దేశేంలో ఉన్నాడు. అందుకే తన నటిస్తున్న మూవీలో భారీ స్టార్ కాస్టింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో మెగా హీరోలతో పాటు, రామ్ చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించబోతున్నాడు. అలాగే మెగా క్యాంప్ నుండి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన విషయంలో చిరంజీవి ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం చిరంజీవి, తన 150వ చిత్రంలో స్టోరికి సంబంధించిన స్పెషాలిటీస్ ని చెబుతూ, రజనీకాంత్ ని ఈ మూవీలో నటించాల్సిందిగా కోరాడట. అందుకు రజనీకాంత్ సైతం ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చిరంజీవి 150వ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నాడనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: