నేటియువతరంలో రెజీనా క్రేజ్ ఎక్కువగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంభంధం లేకుండా హీరో ఎవరున్నా ఆమె సినిమాలకి ఆమె హైలైట్‌ పాయింట్‌ గా మారుతూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది రెజీనా. ఈమధ్యకాలంలో రిలీజ్ అయిన ‘కొత్త జంట’ సినిమాలో కూడ ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. లేటెస్ట్ గా విడుదల అయిన 'రారా కృష్ణయ్య' సినిమాలో కూడ ఈమె తన టాలెంట్‌ చాటుకుంది. ఈ సినిమాలో తనలోని గ్లామర్‌ యాంగిల్‌ని కూడా బాగా చూపించి యూత్ ను ఆ కట్టుకుంది. అయితే రెజీనా ఎంత కష్ట పడ్డా ఆమె చిన్న సినిమాల హీరోయిన్ గానే టాలీవుడ్ లో ముద్ర వేయించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  లిప్ లాక్ సీన్స్ లో నటిస్తాను హాట్ సీన్స్ కు రెడీ అని ఆమె సంకేతాలు ఇస్తున్నా ఈమెకు టాప్ యంగ్ హీరోలు నటిస్తున్న ఒక్క సినిమాలో కూడ చాన్స్ రాకపోవడం రెజీనాకు షాకింగ్ గా మారిందట. చిన్న హీరోల సినిమాలతో ఇలా సరిపెట్టుకుంటుపోతే చివరకు బుల్లి సినిమాల హీరోయిన్ గా మిగిలిపోతాను అనే బెంగ రేజీనాను పీడిస్తోంది అని టాక్.  రవితేజ ‘పవర్‌’ లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కినా ఆ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత హన్సికకు ఉండటంతో ఆ సినిమా కూడా రెజీనాకు పెద్ద బ్రేక్ ఇచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. నటించగల సమర్ధత ఉన్నా గ్లామర్ ఉన్నా అదృష్టం రెజీనాకు కలిసి రావడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. పారితోషికం తక్కువ తీసుకుంటున్నా టాప్ హీరోలు ఎవ్వరూ తనను పట్టించుకోనందుకు అందరి పై రెజీనా కోపంతో ఉంది అంటూ సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: