సన్నగా మెరుపు తీగలా ఉండే అనుష్క శర్మకు బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. ఆమె బరువు అటూ ఇటూగా ఓ యాభై కేజీలు ఉండవచ్చు అని అంటారు. మన క్రేజీ బ్యూటీస్ అంతా ఇంచుమించు ఇదే బరువును మెయిన్‌టైన్ చేస్తుంటారు. దీనివల్లనే కాబోలు ‘దేవదాస్’, ‘జోధా అక్బర్’ చిత్రాల్లో ఐశ్వర్యారాయ్, ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ సినిమాలలో అనుష్క కేజీల కొద్దీ నగలు, బరువుతో ఉన్న దుస్తులు ధరించినప్పుడుమీడియాకు హాట్ టాపిక్ గా మారి వారి కష్టాన్ని పొగుడుతూ వార్తలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులో అనుష్కశర్మ కూడా చేరిపోయింది.  ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘బాంబే వెల్వెట్’ సినిమాలో అనుష్క శర్మ జాజ్ సింగర్‌గా నటిస్తోంది. ఆధునిక యువతి పాత్ర కాబట్టి, చాలా స్టయిలిష్‌గా కనిపిస్తూ ఈ సినిమాలో దాదాపు 144 రకాల దుస్తుల్లో కనిపిస్తుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఈమె వాడుతున్న దుస్తులలో ఒక పొడవాటి గౌను కూడ ఉంది. ఆ గౌను బరువు 35 కేజీలు. దీన్ని నిహారికా బాసిన్‌ఖాన్ డిజైన్ చేశారు. పొడవాటి గౌను కాబట్టి, అనుష్క నడుస్తున్నప్పుడు ఇద్దరు అసి స్టెంట్లు రెండు వైపులా ఆమెతో నడుస్తూ గౌను పట్టుకోవాల్సి వచ్చిందట. ఈ గౌనులో నడవడమే కష్టం అలాంటిది ఇక డాన్స్ చేయాల్సి వస్తే అనుష్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ గౌను డిజైన్ చేయడానికి చాన్నాళ్లు పట్టిందట. మొత్తం డిజైనింగ్ పూర్తయిన తర్వాత డిజైనర్ నిహారికా ఊపిరి పీల్చుకుందని టాక్. ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరిగినప్పుడు, అక్కడి వర్షాలకు గౌను పై భాగం మొత్తం తడిచిపోయింది దాంతో డ్యామేజ్ అయినంతవరకూ కత్తిరించి మళ్లీ డిజైన్ చేశారట. షుమారు 50 కేజీలు ఉండే అనుష్క 35 కేజీలు బరువున్న ఈ గౌనును ఎలా భరించిందో అంటూ ఈ హాట్ బ్యూటీ పై బాలీవుడ్ మీడియా సెటైర్లు వేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: