జూనియర్ ఎన్టీఆర్ ఏక్షణాన్న ‘రభస’ సినిమా మొదలు పెట్టాడో తెలియదుకాని ఆసినిమా మొదలు అయిన దగ్గర నుంచి ఆ సినిమాను రకరకాల సమస్యలు చుట్టుముట్టి జూనియర్ కు చుక్కలు చూపెడుతోంది. ‘‘రామయ్యా వస్తావయ్యా ’ పరాజయం తరువాత ఈ సినిమా విజయం యంగ్ టైగర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈ సినిమా పై జూనియర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.  ఈ సినిమాను ఎట్టి పరిస్థితులలోను ఆగష్టు 14వ తేదీన విడుదల చేయాలనీ గట్టిపట్టుదల పై ఉన్న జూనియర్ సంకల్పానికి ఈ సినిమా ఆడియో విడుదలకు సంబంధించి అదిలోనే అడ్డంకులు ఎదురు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా ఆడియో ఈనెల 20వ తేదీన ఆడియోను విడుదల చేస్తారని ప్రకటించడంతో ఆ రోజు కోసం జూనియర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  అయితే ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న తాజా సమాచారం ప్రచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదలకు నిర్మాత బెల్లంకొండ సురేష్ కు పోలీస్ పర్మిషన్ రావడంలో సమస్యలు ఎదురు అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. గతంలో బాద్షా సినిమా ఆడియో టైంలో తొక్కిసలాట జరిగి జూనియర్ అభిమాని చనిపోయిన దృష్ట్యా ‘రభస’ ఆడియో వేడుకకు పోలీస్ అధికారులు చాల కండిషన్స్ చెపుతున్నట్లు తెలుస్తోంది.  మరొక వైపు రంజాన్ మాసం కూడ నడుస్తూ ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా కారణాలరీత్యా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను బహిరంగ ప్రదేశంలో జరిపే విషయంలో సందిగ్ధత ఏర్పడింది అని టాక్. ఒక వైపు ఈ సినిమా రిలీజ్ డేట్ దూసుకు వస్తూ ఉండటంతో ‘రభస’ ఆడియో ఫంక్షన్ అనుకున్న సమయానికి జరుగుతుందా అనే ఆశక్తి అందరిలోనూ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: