టాప్ హీరోల భారీ సినిమాల సక్సస్ లో బ్రహ్మి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందీ. కొన్ని సినిమాలు అయితే కేవలం బ్రహ్మి పాత్రను బేస్ చేసుకుని నిర్మింప బడుతున్నాయి అన్న విషయం అందరు అంగీకరించే సత్యం. బ్రహ్మానందం క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి కొన్ని సినిమాలలో హీరోయిన్స్ తో స్టెప్స్ కుడా వేయించారు. అనేకమంది ఐటమ్ గర్ల్స్ బ్రహ్మనoదంతో ఆడి పాడిన సందర్భాలు ఉన్నా టాప్ హీరోయిన్స్ తో బ్రహ్మి స్టెప్స్ వేసిన సందర్భాలు చాల అరుదు. అయితే బ్రాహ్మితో కాజల్ ఐటెమ్ సాంగ్ చేయడం టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కోన వెంకట్ సమర్పణలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న గీతాంజలి సినిమాలో ఐటమ్ సాంగుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ముందుగా ఆ పాటకు సమంతను అనుకోగా సమంత జారుకోవడంతో కాజల్ వచ్చి పడింది. టాలీవుడ్ సీతమ్మ అంజలి నటిస్తున్న గీతాంజలి సినిమాలో బ్రహ్మానందంది కీలకపాత్ర అందుకే కాజల్ అగర్వాల్ తో పాటు ఈ ఐటమ్ సాంగ్ లో బ్రహ్మానందంను కూడ కలిపితే ఈ పాటకు తద్వారా ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని ఈసినిమా దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాక్ . ఏది ఏమైనా కాజల్ బ్రహ్మి ల రొమాన్స్ మరో సంచలనానికి తెర తీయబోతోంది అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: