మెగా హీరో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ, తన ఫిల్మ్ కెరీర్ లోనే నిలిచిపోయే సినిమా. అయితే అది సక్సెస్ లిస్ట్ లో కాదు. డిజాస్టర్ మూవీగా రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నటికీ ఆరెంజ్ మూవీ నిలిచిపోతుంది. అయితే ఆ మూవీని డైరెక్ట్ చేసిన బొమ్మరిల్లు బాస్కర్ ని మాత్రం మెగా హీరో క్షమించలేదు. ఎందుకంటే 2010లో వచ్చిన ఆరెంజ్ మూవీ తరువాత, బాస్కర్ మూడు సంవత్సరాల వరకూ ఒక్క మూవీకి కూడ దర్శకత్వం వహించలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి బాస్కర్ కి క్లాస్ పీకినట్టు, ఆ ఎఫెక్ట్ ఇప్పటి వరకూ ఉండిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ కి వస్తున్న ప్రాజెక్ట్స్, మెగా హీరో రామ్ చరణ్ కారణంగా వెనక్కి పోతున్నాయదే టాలీవుడ్ లో టాక్ గా వినిపిస్తుంది. అందుకే భాస్కర్ తెలుగులో ఎక్కువ మూవీలను చేయలేక పోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ సరికొత్త మూవీకి సిద్ధంగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు మూవీ ఏ విధంగా బ్లాక్ బస్టర్ సాధించిందో, ఇప్పడు అదే విధంగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కబోతుంది. ఇటీవల మలయాళంలో హిట్ అయిన "బెంగళూర్ డేస్"ను తెలుగులో దిల్ రాజు - పి వి పి బ్యానర్ రీమేక్ చేస్తూ దర్శకుడిగా భాస్కర్‌కు ఛాన్స్ ఇచ్చారని టాక్. ముగ్గురు యువనాయకులు నటించే ఈ సినిమా కథ - కథనాలపై భాస్కర్ కసరత్తు చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు విజయంతో తెలుగు సినీ నిర్మాతలు భాస్కర్ వెంట పడ్డారంటే అతిశయోక్తి కాదు. కాని ఆ స్టార్ డం వెంటనే రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు నమ్మి చేతుల్లో పెట్టిన ఈ ప్రాజెక్టుతోనయినా భాస్కర్ తన స్టార్ డం ని చూపించుకుంటాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: