ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న మూవీలు టాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న మూవీల సక్సెస్ రేటు అధికంగా ఉందని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నాయి. అయితే మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరో. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల మధ్య ఠఫ్ కాంపిటేషన్ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎక్కువ సమయాన్ని మూవీలకి కేటాయించడం అనేది సాధ్యం కాని పనిగా మారింది. అందుకే తన ముందు ఉన్న రెండు చిత్రాలని పవన్ కళ్యాణ్ పూర్తి చేసిన తరువాత మూవీలకు గుడ్ బై చెప్పబోతున్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో బడా నిర్మాతలు మహేష్ బాబు కాల్షీట్స్ ని బుక్ చేసే పనిలో తెగ బిజిగా ఉన్నారు. ఈ విధంగా మహేష్ బాబు కాల్షీట్స్ కి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 28 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు, తన అప్ కమింగ్ మూవీలకి దాదాపు 35 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా రెమ్యునరేషన్ కి సంబంధించిన అమౌంట్ లో సగం వరకూ ప్రి అడ్వాన్స్డ్ గా చెల్లించాల్సిందిగా అంటూ టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. ఆ రకంగా చూసుకుంటే టాలీవుడ్ కి సంబంధించిన అతి తక్కువ నిర్మాతలకే మహేష్ బాబు రిపీటెడ్ మూవీలు చేయాల్సి ఉంటుంది. మిగతా నిర్మాతలకి మహేష్ బాబు కాల్షీట్స్ దొరకటం అనేది చాలా కష్టతరం. అయితే బడా నిర్మాతలలో ఒకరు, పెద్ద హీరోల రెమ్యురేషన్ ఎంత తీసుకోవాలి అన్న దానిపై ఓ లిమిలేషన్ ఉండాలి అంటూ ఫిల్మ్ ఛాంబర్ లో ఈ ఇష్యూని పెద్దది చేయటానికి తన వంతుగా మద్దతు కూడ కడుతున్నాడని తెలిసింది. ఈ విషయంలో బడా నిర్మాతలంతా ఒక తాటిపైకి వస్తే మహేష్ బాబు రెమ్యునరేషన్ తో పాటు పలు బడా హీరోల రెమ్యునరేషన్ సైతం తగ్గే అవకాశం ఉందని టాలీవుడ్ అంటుంది. మొత్తంగా నిర్మాతలు అంతా మహేష్ బాబు రెమ్యునరేషన్ ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: