మెగా కుటుంబంలోకి మరో ముగ్గురు కొత్తగా వచ్చారు. ఈ విషయం అధికారికంగా రామ్ చరణ్ తన ఫేస్ బుక్ లో వెల్లడి చేసాడు. అయితే రామ్ చరణ్ ఇంటిలోకి కొత్తగా చేరిన వ్యక్తులు ఎవరనుకుంటున్నారా? రామ్ చరణ్ కుటుంబంలోకి కొత్తగా వచ్చింది మనుషులు కాదు మూడు కుక్కలు.  కుక్కలు అంటే ఎంతో ఇష్టపడే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇప్పటికే అనేక కుక్కలను పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి మరో మూడు వచ్చి చేరాయి. తమ కుటుంబంలోకి మరో ముగ్గురు కుటుంబ సభ్యులు వచ్చి చేరినందుకు తనకు చాల ఆనందంగా ఉంది అంటూ ఒక కామెంట్ పెట్టి ఆ కుక్కలకు సంబందించిన ఒక వీడియోను కూడ తన పేస్ బుక్ లో పోస్ట్ చేసాడు రామ్ చరణ్.  గుర్రాలు, కుక్కలు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న రామ్ చరణ్ ఇంటిలో ఎదో ఒకరోజుకు మెగా కుటుంబ సభ్యులకంటే జంతువుల సంఖ్య ఎక్కువ అయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం చరణ్ ‘గోవిందుడు’ సినిమాలో బిజీగా ఉన్నాఈ కొత్త కుటుంబ సభ్యులతో ఎంతో కొంత సమయం గడుపుతూ వాటి పై తన ప్రేమను చాటుకుంటున్నాడు చరణ్.  ఈ వార్తలు ఇలా ఉండగా చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ టీజర్ ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలింనగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: