భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తాడని కోలీవుడ్ దర్శకుడు శంకర్ కు పేరుంది. కానీ కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ ముందు శంకర్ కూడ సరిపోవడంలేదు. విజయ్ హీరోగా మురుగదాస్ నిర్మించిన ‘కత్తి’ సినిమా టీజర్ కు నాలుగు కోట్లు ఖర్చులు అయ్యాయి అనే మాట కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది. గతనెల విజయ్ పుట్టినరోజునాడు విడుదల అయిన ఈ టీజర్ లో ఎక్కడా విజయ్ కనిపించడు. కానీ ఆ టీజర్ లో రకరకాల గ్రాఫిక్స్ కనిపిస్తాయి. వెరైటీ కోసమని ఈ టీజర్ మేకింగ్ మురుగదాస్ అమెరికాలో చేయించాడని టాక్. అయితే ఈ టీజర్ మేకింగ్ అంతా అమెరికాలోని ప్రముఖ దిన పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఎడ్వటైజ్ మెంట్ ను పోలి ఉండటంతో మురుగదాస్ నిర్మాతచేత ‘కత్తి’ టీజర్ కోసం కోట్లు ఖర్చు పెట్టించి న్యూయార్క్ టైమ్స్ ను కాపీ కొట్టాడు అంటూ కోలీవుడ్ మీడియా తెగ రభస చేస్తోంది.  ఈ విషయాలు ఇలా ఉండగా మురుగదాస్ తన ‘కత్తి’ ని దీపావళికి విడుదల చేసే బిజీలో ఉన్నాడు. ఇందులో వచ్చే కొన్ని ముఖ్య పాత్రల కోసం బాలీవుడ్ తరాల చేత కూడ నటింప చేస్తున్నాడు అనే టాక్ కూడ ఉంది. అయితే ఈ సినిమాలో అజిత్ ఒక అతిధి పాత్ర పోషిస్తాడు అనే రూమర్ కూడ ఉంది. ‘తుపాకి’ తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి' ఇప్పటికే బయ్యర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దీపావళికి కోలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: