మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి తానే స్వయంగా క్లారిటీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది. మీడియా తమన్నా ముందు ఎప్పుడు పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చినా తన పెళ్ళికి ఇంకా సమయం ఉంది అని చెప్పే తమన్నా యూటర్న్ తీసుకుని తనది ముమ్మాటికీ లవ్ మ్యారేజ్ అంటూ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది. అయితే షరా మామూలే ఇంకా తనకు నచ్చిన డ్రీమ్ బాయ్ తనకు తారస పడలేదు అని చెపుతోంది ఈ మిల్కీ బ్యూటీ. బాలీవుడ్‌లో ఒక చక్రం తిప్పుదామని ప్రయత్నించినా అక్కడ పరిస్థితులు అనుకూలించక నటించిన మూడు సినిమాలు పరజయాలనే మిగల్చడం తో నిరాశతో ఇక సెటిల్ అయిపోదామని తమన్నా తన పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చిందా లేకుంటే నిజంగానే తమన్నా మనసు పెళ్లి పై మళ్లిందా అన్న విషయం పై క్లారిటీ లేదు. బాలీవుడ్ లో ఎలా ఉన్నా తమన్నా టాలీవుడ్ లో మాత్రం మహేష్ ప్రభాస్ ల చెంత భారీ సినిమాలు చేస్తూ మరో వైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ కూడ తమన్నా తన హవా కొనసాగిస్తోంది. ఒక వైపు లవ్ మ్యారేజ్ అని చెపుతూ మరో వైపు తన అమ్మానాన్నల పర్మిషన్ తో తన పెళ్లి అని చెపుతున్న తమన్నా పెళ్ళి విషయం పై ఆమెకే క్లారిటీ లేదేమో అని అనిపిస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: