టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరో రామ్ చరణ్ నటించబోతున్న మూవీకి సంబంధించిన టీజర్ త్వరలోనే విడుదల కానుంది. రామ్ చరణ్ నటిస్తున్న గోవిందుడు అందరివాడేలే మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తాజాగా రిలీజ్ అయిన మహేష్ బాబు ఆగడు మూవీ టీజర్ యూ ట్యూబ్ తో పాటు టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తరువాత నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరోగా మహేష్ తన స్టామినాని ఆగడు మూవీ టీజర్ లో చూపించాడు. ఇప్పుడు మహేష్ ఆగడు మూవీ టీజర్ కి కౌంటర్ ఇచ్చే విధంగా తన మూవీకి సంబంధించిన రామ్ చరణ్తన మూవీ టీజర్ ని రెడీ చేసుకుంటున్నట్టు టాలీవుడ్ లో కథానాలు వినిపిస్తున్నాయి. గోవిందుడు అందరివాడేలే మూవీ టీజర్ కి సంబంధించిన ఫైనల్ అవుట్ ని ఇప్పటికే రామ్ చరణ్ చూసినట్టుగా చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం. అయితే ఆ టీజర్ లో పలు మార్పులను రామ్ చరణ్ సూచించినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ - కాజల్ జంటగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ని ఈనెల 28 న విడుదల చేస్తున్నారని సమాచారం. దర్శకుడు కృష్ణవంశీ జన్మదినం సందర్భంగా వస్తున్న టీజర్ అద్భుతంగా వస్తోందని నిర్మాత గణేష్ ఇప్పటికే మేటర్ ని అందరికి చెప్పాడు. దసరా కానుకగా అక్టోబర్ 1 న విడుదలయ్యే ఈ సినిమా తాజా షెడ్యూల్ 13 నుండి పొల్లాచ్చిలో జరుగనుందని యూనిట్ సభ్యుల సమాచారం. ప్రకాష్ రాజ్ - జయసుధ శ్రీకాంత్ - కమిలిని ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ కుటుంబ కథాచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల చేసేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నాడు. మొత్తానికి రామ్ చరణ్ ప్రస్తుతం గోవిందుడు అందరివాడేలే మూవీ టీజర్ పై ప్రత్యేక దృష్టిని పెట్టడం అభిమానులకి ఆసక్తిని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: