సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత ఇక నుండి తన అభిమానులకే కాకుండా, ప్రజలకి సైతం తన చేతి వంటని రుచి చూపించబోతుందని అంటున్నారు. మేటర్ ఏంటంటే సమంత ఈ మధ్య కాలంలో ఫుల్ బిజి హీరోయిన్ గా మారిపోయింది. సమంత కాల్షీట్స్ దొరకాలటే దాదాపు సంవత్సరం వరకూ వెయిట్ చేయాల్సిందే. కాదనుకొని సమంతని బ్రతిమాలిడితే కాల్షీట్స్ కి మరింత డిమాండ్ ని పెంచి దాదాపు కోటిన్నర రూపాయలను వసూలు చేయటానికి సిద్ధంగా ఉంది. అందుకే సమంత ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో కంటే కాస్ట్ లీ హీరోయిన్. ఇదిలా ఉంటే సమంత ఓ వైపు హీరోయిన్ గానే ఉంటూ మరో వైపు బిజినెస్ వైపు ఆలోచిస్తుంది. సంపాదించిన మనీని బ్యాంక్స్ లో దాచుకునే కంటే వాటితో బిజినెస్ చేసి బిజినెస్ మెన్ లా మారితే తన ఫ్యూచర్ కెరీర్ కే చాలా మంచిదని ఆలోచించిందట. వెంటనే తను చెన్నై లో ఓ స్టార్ హీటళ్ ని టేకోవర్ చేసుకోబోతుందంటూ కోలీవుడ్ టాక్స్ వినిపిస్తున్నాయి. చెన్నై లోని టి.నగర్ లో దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన స్టార్ హోటళ్ తను టేకోవర్ చేసుకుంటుందట. మంచి రన్నింగ్ లో ఉన్న స్టార్ హోటల్ అమ్మకానికి రావడంతో, సమంత వెంటనే ఆ హాటళ్ యాజమాన్యంతో మాట్లాడి చాలా తక్కువ రేటుకే హాటల్ ని చేజిక్కించుకుంది. త్వరలోనే తన హోటల్ కి సంబంధించిన సరికొత్త విషయాలను చెప్పటానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. అంతే కాకుండా తను తీసుకున్న హోటల్ లో షేర్స్ ని ఇవ్వటానికి సిద్ధంగా ఉందట. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది అభిమానులు, సమంతతో బిజినెస్ లో భాగస్వామ్యం అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి సమంత హోటల్ బిజినెస్ ఏ విధంగా సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: