అతి తక్కువ సినిమాలతో అతి ఎక్కువ పాపులారిటీ సాధించిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ తెలుగు తెర జక్కన్న తీస్తున్న బాహుబలి వచ్చే సంవత్సరం విడుదల కావడం ఖాయం అవడంతో ఈ సినిమా తరువాత రాజమౌళి తీయబోయే సినిమా పై ఇప్పటి నుంచే ఉహాగానాలు మొదలయ్యాయి.
‘బాహుబలి’ సినిమాను నేరుగా హిందీలో కుడా విడుదల చేసేందుకు సన్నాహాల నేపథ్యంలో రాజమౌళి క్రేజ్ బాలీవుడ్ ను కుడా తాకింది. రాజమౌళి ద్రుష్టి ఎప్పటినుంచో హాలీవుడ్ పై ఉంది అన్న వార్తలు ఉన్నాయి. అదేవిధంగా బాలీవుడ్ మిల్కీ బాయ్ రణబీర్ ఆలోచనలు కుడా హాలీవుడ్ పై ఉన్నట్లుగా వార్తలు ఉన్నాయి.
ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి హాలీవుడ్ యాక్షన్ హీరో జెట్లీ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్లతో హాలీవుడ్ సినిమా తీయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు బాలీవుడ్‌తో బాగా పరిచయం ఉండటం రాజమౌళికి కలిసి వస్తున్న అంశంగా చెపుతున్నారు. రాజమౌళికి ఎప్పటినుంచో మహాభారతాన్ని హాలీవుడ్లో తీయాలనే ఆలోచనలో ఉన్నా ముందుగా వీరిద్దరితో ఒక యాక్షన్ సినిమాను హాలీవుడ్ లో తీసే ఆలోచన చేస్తున్నాడట మన జక్కన్న.
సినిమాను విజువల్ గా రిచ్‌గా తీయడంలో ప్రతిభ ఉన్న రాజమౌళి హాలీవుడ్ సినిమాల స్థాయిలో పాత్రల మధ్య సంభాషణ లు పండించగల స్థాయి రాజమౌళికి ఉందా అనిప్రశ్నించే విమర్శకులు కూడ ఉన్నారు. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలను బట్టి రాజమౌళి తీయబోయే తరువాతి సినిమా హాలీవుడ్ లోనే ఉంటుoది అని అంటున్నారు విశ్లేషకులు.
మరింత సమాచారం తెలుసుకోండి: