టాలీవుడ్ లో శ్రియ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో శ్రియ నాగార్జునతో నటించిన ‘మనం’ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ వార్తలలోకి వచ్చింది. అంతేకాదు పవన్ వెంకటేష్ ల మూవీ ‘గోపాల గోపాల’ లో హీరోయిన్‌గా శ్రియ ఛాన్స్ కొట్టేసింది. అయితే మనం ఎంత సూపర్ హిట్ అయినా ఈ సినిమా మించి శ్రియకు వస్తున్న ఆఫర్లు ఏమి లేకపోవడం ఈ బాలీవుడ్ బ్యూటీని ఖంగారు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తన గ్లామర్ ఇమేజ్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేసుకుంటూ పోతే అసలుకు మోసం వస్తుందని భయపడి కాబోలు శ్రియ తన విశ్వరూపాన్ని మరోసారి చూపెడుతూ ఒక ఫ్యాషన్ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఫోటో షూట్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మూడు పదుల వయసు దాటిపోయిన శ్రియ ఎన్ని హాట్ ఫోటో షూట్ లు ఇచ్చినా పట్టించుకునే నాధుడు ఎవరు అంటూ ఆమె పై సెటైర్లు కూడ పడుతున్నాయి. మనం’లో చక్కగా కనిపించిన ఈమె, ఆఫర్ల కోసమే ఇలా షూట్ ఇచ్చిందని అనుకుంటున్నారు  మరి ఈ విధంగానైనా టాలీవుడ్‌లో అవకాశాలు శ్రియకు వస్తాయా లేదంటే ఈ ఫోటో షూట్ కు శ్రియ పడిన కష్టం అంతా వృధా అయిపోతుందా అన్న విషయం రానున్న రోజులలో తేలిపోతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: