ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఇలియానా తన ఆస్ట్రేలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు అనేకసార్లు వినిపించాయి. దీనికి తోడు వీరిద్దరూ ముంబాయిలో చట్టాపట్టాలు వేసుకుని తిరిగడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చిoది. ప్రస్తుతం ఇలీ బేబి బాలీవుడ్ లో నటిస్తున్న ‘హేపీ ఎండిరగ్’ సినిమాలో ఇలియానాతో పాటు ఇలియానా బాయ్ ఫ్రెండ్ కూడ నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూలు లాస్‌ ఏంజిలస్‌లో జరుగుతూ ఉండగా ఆండ్రూ తరచూ షూటింగ్ స్పాట్ కు వస్తూ ఉండేవాడట. అంతేకాదు ఆ సినిమా యూనిట్ సభ్యులందరితో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవాడట. అయితే ఆదే సమయానికి ఇలియాన సరసన ఇదే చిత్రంలో కనిపించే ఒక పాత్ర కోసం నటుణ్ని అన్వేషిస్తున్న దర్శకులకు ఈ పాత్రకు ఇలియానా బాయ్ ఫ్రెండ్ సరిపోతాడు అని అనిపించడంతో ఆండ్రూ చేత ఆ సినిమాలో నటింప చేసారట. అనుకోని అవకాశం రావడంతో ఇలియానా కూడ తన బాయ్ ఫ్రెండ్ కు నటనకు సంబంధించి సూచనలు ఇచ్చింది అని టాక్. ఈ షూటింగ్ నుండి ముంబాయికి తిరిగి వచ్చాక ఇలీ బేబి తనకు తెలిసిన దర్శకులు అందరికీ ఈ విషయం చెప్పడమే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ కు కూడ అవకాశాలు ఇమ్మని అడుగుతూ ఉండటంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ పేరు చెపితే బాలీవుడ్ దర్శకులు భయపడిపోతున్నారు అని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: