నందమూరి సింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు చేస్తూ మరొక వైపు హిందూపురం ఎమ్.ఎల్.ఎ గా హిందూపురాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఒక మోడల్ సిటీగా మార్చడానికి రకరకాల వ్యూహాలతో ముందుకు పోతున్నాడు బాలయ్య. నందమూరి బసవతారకం కేన్సర్ హాస్పటల్ మరియు హిందూపురం అభివృద్ధి తారక మంత్రాలుగా పేదరికం ఛాయలు లేని పట్టణంగా హిందుపూర్ ను అభివృద్ధి చేసే పనిలో తాను సినిమాలు చేస్తూనే బిజీగా ఉన్నాడు బాలయ్య. దీనికోసం మంత్రి పదవిని కూడ వదులుకున్నాడు. ఈ నేపధ్యంలో బాలయ్య పడుతున్న కష్టానికి బావ చంద్రబాబు బాలయ్య కూడ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు అని వార్తలు వస్తునాయి. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా ఏర్పాటు చేస్తున్న ఎక్సైజ్ కస్టమ్స్ ఎకాడమీని హిందూపురంలో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిoచడమే కాకుండా దానికి సంబంధించి నిధులను లేటెస్ట్ బడ్జెట్ లో కేటాయింపులు చేయించి చంద్రబాబు బాలకృష్ణ ఇమేజ్ హిందూపురంలో పెరిగే విధంగా ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఈ అనుకోని బహుమతికి సంబరపదిపోతున్న బాలయ్య హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మాదిరిగా తన హిందూపురంలో హార్డ్ వేర్ హబ్ ఏర్పాటు చేసి ప్రముఖ హార్డ్ వేర్ కంపెనీలను హిందూపురానికి ఆహ్వానించి తన సత్తా చాటుదాం అనే ఆలోచన చేస్తున్నాడట బాలకృష్ణ.  కేవలం కొందరు హీరోలులా అలంకార ప్రాయంగా కాకుండా హిందూపురంలో తన రాజకీయ ప్రస్థానాన్ని శాస్వితం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు ఈ నందమూరి ‘లెజెండ్’. 

మరింత సమాచారం తెలుసుకోండి: